: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలం: అంబటి
ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలను మోసం చేసినట్టేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడం లేదంటూ లోక్ సభలో ఈరోజు కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో అంబటి పైవిధంగా స్పందించారు. ఆ సమాధానం సిగ్గుతో తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. హైదరాబాదులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ ఏపీకి తీరని ద్రోహం చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ చేశారు.