: కుమార్తెకు 'ఇండియా' పేరు పెట్టుకున్న జాంటీ రోడ్స్
దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ దిగ్గజం జాంటీరోడ్స్ దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. రోడ్స్ భార్య మెలానీ ముంబయిలోని శాంతాక్రజ్ లో ఉన్న సూర్యా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో గురువారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపాయికి రోడ్స్ దంపతులు 'ఇండియా జియాన్నే రోడ్స్' అని నామకరణం చేశారు. ఈ మేరకు రోడ్స్ ట్వీట్ చేశాడు. రోడ్స్ అర్ధాంగి మెలానీ వాటర్ బర్త్ విధానంలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఈ ప్రసవ విధానం చాలా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ లో రోడ్స్ ముంబయి ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.