: బ్యాంకులకు చైర్మన్లు కావలెను... వెతుకులాటలో కేంద్రం


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకాన్ని పూర్తి చేసిన కేంద్రం చైర్మన్ల కోసం వేట ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్ సభకు శుక్రవారం నాడు తెలియజేశారు. పబ్లిక్ సెక్టారు బ్యాంకుల్లో చైర్మన్, ఎండి పోస్టులను విడదీయాలని ఇప్పటికే నిర్ణయించామని, 5 బ్యాంకుల్లో ఎండీ, సీఈఓల నియామకం పూర్తయిందని, చైర్మన్ పోస్టులను భర్తీ చేయాల్సి వుందని ఆయన తెలిపారు. చైర్మన్ పోస్ట్ నాన్-ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విధానాలకు అనుగుణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంలో భాగంగానే సీఎండీ పోస్ట్ ను చైర్మన్, ఎండీగా విడగొట్టినట్టు వివరించారు. బ్యాంకు విధివిధానాలను చైర్మన్ తయారు చేస్తారని, వాటి అమలు, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ విధులను ఎండీ, సీఈఓల పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News