: హీరోయిన్ నీతూ అగర్వాల్ కోసం పోలీసుల వేట
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో టాలీవుడ్ వర్థమాన హీరోయిన్ నీతూ అగర్వాల్ పై కేసు నమోదైంది. 'ప్రేమ ప్రయాణం' సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నీతూ అగర్వాల్ కు ఆ సినిమా నిర్మాత మస్తాన్ వలీతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమె అకౌంట్ నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు డబ్బులు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెపై కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నీతూ అగర్వాల్ ను అదుపులోకి తీసుకునేందుకు సీఐ శ్రీనివాసులు సారథ్యంలోని పోలీసు బృందం హైదరాబాదు చేరుకుంది. నీతూ నివాసం తాళం వేసి ఉండడంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.