: మమ్ముట్టికి దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణ


ముందు ఇష్టమొచ్చినట్టుగా, వ్యాఖ్యలు చేయడం ఆ తరువాత క్షమాపణ చెప్పడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి విషయంలోనూ అదే చేశాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అంటున్నాడు. మమ్ముట్టి కంటే ఆయన కొడుకు, హీరో దుల్కర్ సల్మాన్ ('ఓకే బంగారం' హీరో) బెటర్ అని, కొడుకు నుంచి మమ్ముట్టి నటన నేర్చుకోవాలంటూ ట్విట్టర్ లో వర్మ సలహా ఇచ్చాడు. అంతేకాదు, వాళ్లిద్దరికీ చాలా అంతరం ఉందని, కొడుకుతో పోల్చితే మమ్ముట్టిని జూనియర్ ఆర్టిస్టుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇలా తనదైన శైలిలో వర్మ చేసిన ట్వీట్లకు దుల్కర్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. పది జన్మలెత్తి ఎంత సాధించినా తన తండ్రి స్థాయికి చేరుకోలేనంటూ ట్వీట్ చేశాడు. దాంతో వర్మ తాజాగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు. ఓ గొప్ప తండ్రికి అసాధారణ కుమారుడు అనే అర్ధంలో తాను ట్వీట్ చేశానని, ఒకవేళ ఈ అభినందనలు అర్ధం చేసుకోకుంటే వారికి తన క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News