: పేరులోనే మమత, చేతలు మాత్రం డిఫరెంటు!


రాజస్థాన్ లో పోలీసులు బుధవారం నాడు ఓ దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్నది ఓ మహిళ! ఏడుగురు సభ్యులున్న ఈ ముఠాను ఆమె ఇప్పటివరకు సమర్థంగానే నడిపిందట. ఆ కిలాడీ పేరు మమతా మీనా. కోటా సిటీలోని రైల్వే కాలనీలో ఈ ముఠా ఉందన్న సమాచారం మేరకు దాడిచేసిన పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా వారికి మూడు రోజుల రిమాండ్ విధించారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. మమతా మీనా గంగాపూర్ జిల్లాకు చెందినది. ప్రస్తుతం ఆమె స్వయం సహాయక సంఘాలతో పాటు ఓ సూక్ష్మ రుణ సంస్థను కూడా నిర్వహిస్తోంది. ఆమె ముఖ్యంగా, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసేదట. వారి గురించి పూర్తిగా తెలుసుకుని, పరిశీలించి, ఆపై ఓ ప్లాన్ రూపొందించి, తన ముఠా సభ్యులను దొంగతనానికి పంపేది. ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 7 మధ్య కాలంలో వీరు నాలుగు దొంగతనాలు చేశారట. రిమాండ్ ముగిసేలోగా, వీరి నేరాల చిట్టా మొత్తం బయటికొస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News