: కేజ్రీవాల్ ఇప్పుడు క్షమాపణలు చెబితే నా కొడుకు తిరిగివస్తాడా?: గజేంద్ర తండ్రి


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పుడు క్షమాపణలు చెప్పినంత మాత్రాన తన కుమారుడు ప్రాణాలతో తిరిగి వస్తాడా? అని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో మృతి చెందిన రైతు గజేంద్ర సింగ్ తండ్రి బనే సింగ్ ప్రశ్నించారు. రాజస్థాన్ లో ఆయన మాట్లాడుతూ, ర్యాలీలో ప్రసంగంపై పెట్టిన శ్రద్ధ కేజ్రీవాల్ తన కుమారుడ్ని కాపాడడంపై పెట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వల్ల కాకపోతే, కనీసం అక్కడున్న పోలీసులను కానీ, కార్యకర్తలను కానీ అతనిని రక్షించాలని ఆదేశించాల్సిందని అన్నారు. కాగా రాజస్థాన్ ప్రభుత్వం 4 లక్షల పరిహారం ప్రకటించగా, సమాజ్ వాదీ పార్టీ 2 లక్షల పరిహారం అందజేసింది.

  • Loading...

More Telugu News