: లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేసీఆర్


లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి కాగానే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి, మిగిలిన స్థానాలకు ఉద్యోగభర్తీ చేపడతామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉద్యోగభర్తీకి అధ్యయనం చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదని ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. నిరుద్యోగులకు తొందర్లోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News