: రాయల్స్ తడబడ్డారు
వరుస విజయాలతో ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో తడబాటుకు గురయ్యారు. ఆర్పీ సింగ్ (3/13), వినయ్ కుమార్ (3/18) బౌలింగ్ ధాటికి 117 పరుగుల స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకున్నారు. కెప్టెన్ ద్రావిడ్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు సారథి కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.