: ఏమీ కోరుకోలేదు... కానీ, అపరిమితమైన శక్తి వచ్చింది: రాహుల్


కేదార్ నాథ్ లో పరమశివుడిని తాను ఏ విధమైన కోరికలూ కోరలేదని, అయితే, దైవ దర్శనం తరువాత తనకు అపరిమితమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేదార్ నాథ్ లో తనను చుట్టుముట్టిన మీడియాతో ఆయన మాట్లాడారు. కేదార్ నాథ్ కు రాగానే తనకు అగ్నితో సమానమైన శక్తి వచ్చినట్టు అనిపించిందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది కూలీలు భక్తుల సామాన్లు మోసుకు వచ్చే పనిలో నిమగ్నమై ఉపాధిని పొందుతున్నారని, వారందరికీ భరోసాను కల్పించేందుకు తాను ప్రయత్నించానని అన్నారు.

  • Loading...

More Telugu News