: ఆలస్యం చేస్తే రాష్ట్రాలకు నష్టం: జీఎస్ టీ అమలుపై అరుణ్ జైట్లీ


ప్రతిపాదిత గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్ టీ)ను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాల్సి వుందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఏ దశలోనైనా జీఎస్ టీ అమలు ఆలస్యమైతే రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్ టీ అమలు విషయమై పార్లమెంట్ వేదికగా సభ్యులు లేవనెత్తిన సందేహాలపై ప్రశ్నించగా, ఈ విషయాన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ఈ వస్తు సేవల పన్నును తమిళనాడు మినహా పెద్ద రాష్ట్రాలన్నీ స్వాగతించిన సంగతి తెలిసిందే. గడచిన 12 సంవత్సరాల నుంచి జీఎస్ టీ అమలు దిశగా చర్చిస్తూనే ఉన్నామని, ఇప్పటికైనా చర్చలు ముగించి, ముందడుగు వేసేందుకు సహకరించాలని యూపీఏ పార్టీలను జైట్లీ కోరారు.

  • Loading...

More Telugu News