: నేను, ఈటెల సన్నగా ఉంటాం... అందుకే హాస్టళ్లకు సన్నబియం ఇస్తున్నాం: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లకు సన్నబియం అందించిన ఘనత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు హాస్టళ్లకు దొడ్డు బియ్యం ఇచ్చాయని, ఆ దుస్థితి చూడలేక తమ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం పెడుతుందని ఉద్ఘాటించారు. ఓ రోజు ఈటెల తన వద్దకు వచ్చి హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారని, తాను వెంటనే ఒకే చెప్పానన్నారు. తక్షణమే దానికి సంబంధించి ఈటెల జీవో జారీ చేసినట్లు పార్టీ ప్లీనరీ సమావేశంలో వివరించారు. తాను, ఈటెల ఇద్దరమూ సన్నగానే ఉంటామని, అందుకే హాస్టళ్లకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామని ఛలోక్తి విసిరారు.

  • Loading...

More Telugu News