: ఫిల్మ్ నగర్ లో యువకుడిని ఢీకొట్టిన నిర్మాత బెల్లంకొండ కారు


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్, రోడ్ నెంబర్ 7లో ఓ యువకుడిని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఢీకొంది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు బెల్లకొండ కార్యాలయంపై దాడిచేసి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో అడ్డుగా వచ్చిన బెల్లంకొండపైనా దాడి చేసినట్టు సమాచారం. కాగా, కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News