: ఏపీ డీఎస్సీ వాయిదా పడలేదు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్ష వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అలాంటి వార్తలన్నీ అవాస్తవమన్నారు. పుకార్లను నిరుద్యోగులు నమ్మవద్దని మంత్రి సూచించారు. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని గంటా మీడియా ద్వారా స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలను మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా 'టీచర్ ఎలిజిబులిటీ టెస్టు' (టెట్) పరీక్షల్లో మధ్యాహ్నం జరిగే పరీక్ష సమయాలను మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు దాని ద్వారా ప్రయోజనం కలగనుంది.