: పశ్చిమ బెంగాల్ లో ఆరు నగరాల పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ!


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆరు నగరాల పేర్లను మార్చుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం, సిలిగురి నగరాన్ని ఇకపై 'తీస్తా'గా వ్యవహరించనున్నారు. తీస్తా పేరిట ఉత్తర బెంగాల్ లో ఒక నది ఉన్న సంగతి తెలిసిందే. బోల్ పూర్ ను 'గీతాబితన్' (రవీంద్రనాథ ఠాగూర్ రచించిన గేయ సంకలనం)గా, పారిశ్రామిక జంట నగరాలు అసన్ సోల్ - దుర్గాపూర్ లను 'అగ్నిబినా' (కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన పద్య సంకలనం)లుగా మార్చారు. మాల్దా జిల్లాలోని గజల్ డోబా పట్టణాన్ని 'ముక్త తీర్థ'గా, కోల్ కతా సమీపంలోని గరియాను 'ఉత్తమ్ సిటీ'గా, నాడియా జిల్లాలోని కల్యాణి టౌన్ షిప్ పేరును 'సమృద్ధి'గా మార్చుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News