: మంత్రి తలసాని, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి ముందు టీడీపీ కార్యకర్తల నిరసన


హైదరాబాదులోని తెలంగాణ వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అటు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి ముందు కూడా టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తల మద్దతుతో గెలిచిన ధర్మారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హన్మకొండలోని ఆయన నివాసం ఎదుట ఆందోళన చేశారు. ధైర్యం ఉంటే టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. చెప్పులు, చీపుర్లు పట్టుకుని చావు డప్పు వాయిస్తూ వినూత్న నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News