: నటి అల్ఫోన్సాపై కిడ్నాప్ కేసు
నటి అల్ఫోన్సా తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ చెన్నై పరిధిలోని మైలాడుదురైకి చెందిన ఓ మహిళ పోలీసు కమిషనర్ జార్జ్ ని కలిసి ఫిర్యాదు చేసింది. చెన్నై సదాశివపేటలో నివసిస్తున్న తమను అల్ఫోన్సా పలుమార్లు చంపుతానని ఫోన్లో బెదిరించినట్టు సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2013లో తమ వివాహం కాగా, అంతకుముందే తన భర్త జయశంకర్ ను వివాహం చేసుకున్నానని అల్ఫోన్సా చెబుతోందని, అతన్ని వదిలిపోకుంటే చంపుతానని బెదిరించిందని ఆమె తెలిపింది. తన ఫిర్యాదుతో పాటు అల్ఫోన్సా, జయశంకర్ లు సన్నిహితంగా ఉన్న వీడియోలు, తమ పెళ్లి ఫోటోలను కమిషనర్ కు అందించగా, కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించి, విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అడయారు అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.