: ఇక యాక్టర్ గా సచిన్... సొంత డాక్యుమెంటరీలో నటిస్తున్న మాస్టర్ బ్లాస్టర్!
మొన్నటిదాకా క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్, ఆ తర్వాత చట్టసభ సభ్యుడిగా కొత్త అవతారం ఎత్తాడు. తదనంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను దక్కించుకున్న మాస్టర్ బ్లాస్టర్, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు. తాజాగా అతడు నటుడిగానూ మరో అవతారం ఎత్తాడు. ముఖానికి రంగేసుకుని కెమెరా ముందుకు వచ్చేశాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ డాక్యుమెంటరీ-ఫీచర్ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ ఎర్ స్కిన్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సచిన్ తన వ్యక్తిగత సామాగ్రితో కెమెరా ముందుకు వచ్చాడు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ డాక్యుమెంటరీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.