: గ్యాస్ సబ్సీడీక ఈటెల గుడ్ బై... ధనవంతులు రాయితీ వదులుకోవాలని పిలుపు
సర్కారీ రాయితీలు అవసరం ఉన్నవారికే అందించేందుకు తోడ్పాటునందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలే కాదు, ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న రాజకీయ నేతల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ప్రధాని ‘గివ్ ఇట్ అప్’ పిలుపునకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. గ్యాస్ సబ్సీడీని వదులుకుంటున్నట్లు ఈటెల రాజేందర్ నిన్న ప్రకటించారు. ‘‘ప్రభుత్వం ఉన్నది పేదల కోసం. ధనవంతులు... వారికి వారే సబ్సీడీల విషయంలో కొంతమేరకు నియంత్రించుకోవాలి. అటువంటి విశాల దృక్పథం రావాలి. సంపన్నులు రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సీడీ తదితర ఎలాంటి సబ్సీడీలనైనా నియంత్రించుకోవాలి’’ అని ఈ సందర్భంగా ఈటెల పిలుపునిచ్చారు.