: మద్యం మత్తులో ప్రయాణికుడి వీరంగం... అనంత బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ మృతి
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ తో నెలకొన్న చిన్నపాటి వివాదం నేపథ్యంలో మద్యం మత్తు తలకెక్కిన ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి దిగిన ప్రయాణికుడు నారాయణప్పను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.