: వాహనాలపై విరిగిపడ్డ కొండ చరియలు... విజయవాడలో భారీగా ట్రాఫిక్ జాం
ఈ ఉదయం ఈదురుగాలులు, పిడుగులతో కురిసిన భారీ వర్షానికి విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. క్యుములో నింబస్ మేఘాల వల్ల ఒక్కసారిగా కుండపోత వర్షం కురవగా, విజయవాడలో ఇంద్రకీలాద్రి నుంచి కొండ చరియలు విరిగిపడ్డాయి. హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలో జాతీయ రహదారిపై వెడుతున్న వాహనాలపై బండలు పడడంతో, పలు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.