: టిప్పు సుల్తాన్ ఖడ్గానికి కళ్లు తిరిగే ధర... వేలంలో రూ.20 కోట్లు పలికిన వైనం


మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం భారీ ధరకు అమ్ముడుబోయింది. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. నిన్న లండన్ లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను ‘బోన్ హామ్స్’ విక్రయించేసింది. టిప్పు సుల్తాన్ కత్తికి రూ.20.49 కోట్లు రాగా, మిగిలిన ఆయుధాలకు రూ.37 కోట్లు వచ్చాయట. వేలం ప్రారంభానికి ముందు టిప్పు సుల్తాన్ కత్తికి రూ.10 కోట్లు రావచ్చని బోన్ హామ్స్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంస్థ అంచనాలను పటాపంచలు చేస్తూ టిప్పు సుల్తాన్ ఆయుధాలు ఆ సంస్థకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.

  • Loading...

More Telugu News