: ముంబై రాత మారలేదు... ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడిన రోహిత్ సేన
ఐపీఎల్-8లో ముంబై ఇండియన్స్ రాత మారలేదు. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో చిత్తుగా ఓటమిపాలైంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (83), జేపీ డుమిని (78)లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 190 పరుగులు చేసింది.ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై, 20ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగుల వద్దే చేతులెత్తేసింది. దీంతో ముంబైపై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), హైదరాబాదీ కుర్రాడు అంబటి రాయడు (30)లతో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగిన పార్ధీవ్ పటేల్ (28) మినహా మిగిలిన వారెవరూ బ్యాట్ ఝుళిపించలేకపోయారు