: ముంబై బౌలర్లని ఉతికి ఆరేసిన శ్రేయస్ అయ్యర్, డుమిని


ముంబై ఇండియన్స్ బౌలర్లను దేశవాళీ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్, విదేశీ ఆటగాడు జేపీ డుమిని ఆటాడుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన డిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కేవలం రెండు పరుగులకే మయాంఖ్ అగర్వాల్ (1) వికెట్ కోల్పోయింది. ఢిల్లీ తరపున అద్భుత ప్రదర్శన చేస్తున్న యమాంఖ్ అగర్వాల్ తొందరగా అవుటవ్వడంతో ఢిల్లీ ప్రదర్శనపై అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ (83)కు జత కలిసిన కెప్టెన్ డుమిని (78) స్కోరు బోర్డును కదం తొక్కించారు. అద్భుతమైన షాట్లతో విరుచుకుపడిన వీరిద్దరూ రెండో వికెట్ కు 155 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్ సీజన్ లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. శ్రేయస్ ను మలింగ బౌల్డ్ చేయడంతో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ (17) స్కోరు బోర్డును పరుగులెత్తించే క్రమంలో మెక్ క్లెంగన్ కు చిక్కాడు. యువీ కేవలం రెండు పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, డుమినీ ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 190 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో క్లెంగన్ రెండు వికెట్లు తీయగా, మలింగ, బుమ్రా చెరోవికెట్ తీసి సహకారమందించారు. 191 పరుగుల విజయ లక్ష్యంతో ముంబై బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News