: ఏపీ రాజధానిలోనూ ట్యాంక్ బండ్!
హైదరాబాదులో ట్యాంక్ బండ్ ఎంతటి సందర్శనీయ స్థలమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పక్కనే హుస్సేన్ సాగర్... అందులో బుద్ధ విగ్రహం... టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని నిర్మించనున్న సర్కారు టూరిజం డెవలప్ మెంట్ పైనా దృష్టి సారించింది. అందుకే, రాజధాని ప్రాంతంలోనూ ఓ సరస్సు, ట్యాంక్ బండ్ నిర్మించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. కంచికచర్ల, నందిగామ వద్ద ఈ నిర్మాణాలు ఉంటాయని తెలుస్తోంది. వీటిద్వారా రాజధాని ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, రాజధాని నిర్మాణం పర్యవేక్షణ కోసం కోర్ క్యాపిటల్ డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేశారు.