: చికెన్ వ్యాపారులకు మద్దతుగా మంత్రులు
రంగారెడ్డి జిల్లాలో ఊహించని విధంగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభం ఎందుర్కొంటోంది. పరీక్షలు పూర్తయిన సందర్భంగా దావత్ లు, ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బిగ్ స్క్రీన్ లు ఏర్పాటు చేసిన బారుల్లో చికెన్ వ్యాపారం జోరందుకుంటుంది. అలాగే సాధారణంగా జంటనగరాల్లో చికెన్ వ్యాపారం బాగా సాగుతుంది. బర్డ్ ఫ్లూ కారణంగా జంటనగరాల్లో చికెన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం గుడ్లు కూడా కొనడంలేదు. దీంతో వ్యాపారులు నేతలను ఆశ్రయించారు. వ్యాపారంలో నష్టాలు రాకుండా ఆదుకోవాలని సూచించారు. అంతటితో ఆగకుండా నేతల మద్దతుతో సికింద్రాబాద్ లో చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు పాల్గొని చికెన్ తో చేసిన వంటకాలను ఆరగించారు. ప్రజలు అపోహలు వీడి చికెన్ ఆరగించాలని వారు పిలుపునిచ్చారు.