: అప్పుడు ఇందిర... ఇప్పుడు రాహుల్!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేదార్ నాథ్ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఆయన డెహ్రాడూన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టీషర్ట్, జీన్స్ లో క్యాజువల్ లుక్ తో రాహుల్ యువతరానికి ప్రతినిధిలా కనిపించారు. కాగా, రాహుల్ రాకతో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ ఆనందసాగరంలో మునిగితేలుతున్నారు. 1979లో రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీ బద్రీనాథ్ యాత్ర చేయగా, ఆమెతో పాటు తానూ ఉన్నానని, ఇప్పుడు రాహుల్ వెంట కేదార్ నాథ్ వెళుతున్నానని ఆయన వివరించారు. అప్పట్లో ఇందిర 40 కిలోమీటర్లు కాలినడకనే బద్రీనాథ్ వెళ్లగా, ఇప్పుడు రాహుల్ కూడా నాయనమ్మ బాటలోనే కాలినడకనే కేదార్ నాథ్ వెళుతున్నారు. శుక్రవారం ఆయన కేదార్ నాథ్ ఆలయానికి చేరుకుంటారు.