: చంద్రబాబు సభకు తేనెటీగల తుట్టెను తీసుకువచ్చారట... కానీ, కవర్లోనే చనిపోయాయి!


మహబూబ్ నగర్లో జరిగిన టీడీపీ భారీ బహిరంగ సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రభస సృష్టించేందుకు ప్రయత్నించడం తెలిసిందే. వారిని పోలీసులు అడ్డుకోవడం, ఆ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవడం జరిగాయి. ఈ ఉదంతంలో మరో విషయం తెలిసింది. బాబు సభకు విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులను చెల్లాచెదురు చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తమతో పాటు ఓ తేనెటీగల తుట్టెను కూడా తీసుకువచ్చారట. అయితే, కవర్లో ఉన్న ఆ తేనెటీగలు ఊపిరాడక చనిపోయాయి. దీంతో, ప్రమాదం తప్పినట్టయిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News