: సినిమాలో విషయం లేకపోతే, ఎన్ని గిమ్మిక్కులు చేసినా లాభం ఉండదు: అమితాబ్


కథలో విషయం లేకపోతే ఎన్ని చేసినా సినిమా విజయం సాధించదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. తన తాజా సినిమా 'పీకూ' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పీకూ' సినిమా ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. ప్రచార కార్యక్రమాలు సినిమాను అభిమానులలో ఉత్సకత రేకెత్తిస్తాయే తప్ప విజయం సాధించేందుకు దోహదం చేయవని ఆయన స్పష్టం చేశారు. సినిమా చూసి విజయం సాధించిందని చెప్పే మాటకే ఎక్కువ విలువ అని, దానికి కథాబలమే ప్రామాణికమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News