: జలంధర్ లో స్కూల్ డైరెక్టర్ ను చితక్కొట్టిన విద్యార్థి తల్లి


పంజాబ్ లోని జలంధర్ లోని ఓ స్కూల్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల యాజమాన్యం తన బిడ్డను వేధిస్తోందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లి సదరు పాఠశాల డైరెక్టర్ ను కలిశారు. కార్పోరేట్ పాఠశాల కావడంతో డైరెక్టర్ గదిలో ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల డైరెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అకస్మాత్తుగా డైరెక్టర్ చెంపపై ఆమె ఒక్కటిచ్చింది. దీంతో అవాక్కయిన డైరెక్టర్ ఆమె చెంపపై ఒక్కటిచ్చి ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లి, డైరెక్టర్ లెంపలు వాయించింది. ఆమె దెబ్బలకు తాళలేక పారిపోతున్న డైరెక్టర్ ను దొరకబుచ్చుకున్న విద్యార్థి తల్లి, చితక్కొట్టింది. డైరెక్టర్ అరుపులు విన్న స్కూలు సిబ్బంది వచ్చి, వారిని విడదీయడంతో దెబ్బలాట సద్దుమణిగింది. దీంతో డైరెక్టర్ పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థి సెల్ ఫోన్ తీసుకోవడంతో ఆమె దాడి చేసిందని డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News