: చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎమ్మార్పీఎస్ నిరసన... ఎస్సైకి తీవ్రగాయాలు!
మహబూబ్ నగర్ లో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు నినాదాలతో అడ్డుతగిలేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వారి నిరసన తీవ్రం కావడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో, ఓ ఎస్సై తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అటు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల వైఖరితో టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.