: జగ్గీవాసుదేవ్ కు భూములివ్వడం సరైన నిర్ణయమే: గంటా
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాల భూమిని కేటాయించడం సరైన నిర్ణయమేనని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జగ్గీవాసుదేవ్ కు భూమిని కేటాయించడాన్ని వివాదం చేయవద్దని సూచించారు. ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థను నెలకొల్పుతాననడంతో ఆ భూమిని కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. లేని పోని వివాదాలు సృష్టించవద్దని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.