: వాచ్ లాంటి సెల్ తో హైటెక్ కాపీయింగ్


చూసేందుకు అచ్చం రిస్ట్ వాచ్ లా ఉన్న సెల్ ఫోన్ తో హైటెక్ కాపీియింగ్ కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థిని డిబార్ చేసిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఇలియాజ్ అనే విద్యార్థి రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడు. చేతికి ఉన్న గడియారం పదేపదే చూస్తూ పరీక్ష రాయడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ శ్రవణ్ అతని గడియారాన్ని పరిశీలించారు. దీంతో సెల్ భాగాలన్నీ దానిలో కనిపించడంతో ప్రిన్సిపల్ కు ఇలియాజ్ ను అప్పగించారు. ఆ రిస్ట్ సెల్ లో 20 సమాధానాలు నిక్షిప్తం చేసుకున్నట్టు గుర్తించారు. తన సెల్ లో సమాధానాలు ఫీడ్ చేసుకుని దీనికి సెండ్ చేశానని, ఒకటి డిలీట్ చేసిన తరువాత ఇంకోటి వస్తుందని, వాటిని చూసి రాస్తున్నట్టు ఇలియాజ్ తెలిపాడు. దీంతో అతనిని డిబార్ చేస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News