: మూడో నగరం తీసుకువచ్చింది నేనే: చంద్రబాబు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలని, వాటికి తోడు మూడో నగరం సైబరాబాద్ ను తీసుకువచ్చింది తానేనని చంద్రబాబు తెలిపారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ.... హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చింది తానేనని, నగరాన్ని గర్వించదగ్గ రీతిలో డెవలప్ చేశామని పునరుద్ఘాటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తీసుకువచ్చానని తెలిపారు. తెలంగాణలో పిల్లలు ఇప్పుడు బ్రహ్మాండంగా చదువుతున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. విభజనకు ముందు అందరికీ న్యాయం చేయాలని చెప్పామని, తెలంగాణ ఇవ్వాలని చెప్పిన మొదటి పార్టీ తమదేనని స్పష్టం చేశారు.