: తెలంగాణలో రాహుల్ రైతు భరోసా యాత్ర చేస్తారు: భట్టి


తెలంగాణలో త్వరలో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర చేస్తారని టీ. కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి భట్టి విక్రమార్క తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకు తెలంగాణలో పర్యటించాలని తాము రాహుల్ ను కోరామని, అందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఇంతవరకు 939 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలేవీ ఉండవని కేసీఆర్ చెప్పడం ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని భట్టి విమర్శించారు.

  • Loading...

More Telugu News