: ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 26,913 మంది విద్యార్థులే హాజరైనట్లు మంత్రి తెలిపారు. జనరల్ విభాగంలో 52 శాతం మందికి ఏ గ్రేడ్ రాగా, ఒకేషనల్ లో 60 శాతం మందికి ఏ గ్రేడ్ వచ్చినట్టు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది 4 శాతం ఎక్కువగా 62.09 ఉత్తీర్ణత సాధించినట్టు గంటా వెల్లడించారు.