: మస్రత్ ఆలం అరెస్టు...లోయ వెలుపలి జైలుకు తరలింపు


జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది మస్రత్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భద్రత చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్) కింద అతనిని అదుపులోకి తీసుకోవాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయనను కాశ్మీర్ లోయ వెలుపలి జైలుకు తరలించారు. జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ కు మద్దతుగా ర్యాలీ, నినాదాలు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, మస్రత్ ఆలం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శనివారంతో అతని రిమాండ్ గడువు ముగియనుంది. మస్రత్ న్యాయవాది సెంట్రల్ బుద్గాం జిల్లా న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

  • Loading...

More Telugu News