: ఆడబిడ్డల కన్నీరు కలచివేస్తోంది: వైఎస్ జగన్


అంగన్ వాడీ కార్యకర్తలు కన్నీరు పెడితే మంచిది కాదని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో పలువురు అంగన్ వాడీ కార్యకర్తలు జగన్ ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వారిని ఓదార్చిన జగన్, ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశామని అన్నారు. ఆడబిడ్డల కంట కన్నీరు కలచివేస్తోందని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, చంద్రబాబు నాయుడి సభలో ప్లకార్డులు ప్రదర్శించిన 15 మంది అంగన్ వాడీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News