: పాలమూరులో అమరవీరులకు చంద్రబాబు నివాళి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. సభా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. టీడీపీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. కాగా, నేతలు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.