: భారత్ లో అల్ జజీరా ప్రసారాలపై నిషేధం


ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపినందుకు కాశ్మీర్ లో అల్ జజీరా టెలివిజన్ చానల్ ను ఐదు రోజుల పాటు నిషేధిస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది. ఈ నిషేధం 27 వరకూ అమలవుతుందని తెలిపింది. ఓ కార్యక్రమంలో భాగంగా అల్ జజీరా భారత మ్యాప్ ను చూపిస్తూ, కాశ్మీర్ ప్రాంతాన్ని మూడు ముక్కలుగా చేసి పాకిస్థాన్, చైనా, ఇండియాల్లో భాగమని పేర్కొంది. దీనిపై సీరియస్ అయిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ పై హక్కులు మావంటే మావని ఇండియా, పాకిస్థాన్ లు పంతాలకు పోవడంతో పలుమార్లు యుద్ధాలు జరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దుల వెంట నేటికీ ఎక్కడో ఒకచోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా అధికారికంగా విడుదల చేస్తున్న మ్యాపుల్లో మొత్తం కాశ్మీర్ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగంగా చూపుతుండగా, ఇతర దేశాల మ్యాపుల్లో మాత్రం పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వదిలేసి భారత బార్డర్ ను చూపుతున్నాయి.

  • Loading...

More Telugu News