: సీఎం చంద్రబాబును కలసిన నటుడు రాజేంద్రప్రసాద్
ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రుడు, కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలసినట్టు చెప్పారు. కేసీఆర్ ను, చంద్రబాబును కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని చెప్పారు. ఇద్దరు సీఎంలు తనకు మంచి స్నేహితులని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై త్వరలోనే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశం నిర్వహిస్తానని కొన్నిరోజుల కిందట రాజేంద్రప్రసాద్ కలసిన సమయంలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.