: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వేసవి ఆరంభం నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించనుంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. మే నెల 1వ తేదీ నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా ఫోన్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటలవరకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్ వర్క్ కైనా, ఏ రాష్ట్రంలోని వ్యక్తికైనా ఉచితంగా ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది.