: మీరు నన్ను, నేను మిమ్మల్నీ విమర్శించుకోవద్దు, రైతు ఆత్మహత్యలపై సమాధానం వెతుకుదాం: మోదీ
భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో రైతు ఆత్మహత్యలు ఒకటని ప్రధాని మోదీ అన్నారు. నిన్న ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ అంశంపై నేడు చర్చ జరుగగా ప్రధాని ప్రసంగించారు. ఈ విషయంలో రాజకీయం చేస్తూ, విమర్శించుకోవడం మానేయాలని ఆయన పిలుపునిచ్చారు. విపక్షాలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం గడచిన పాలనను గుర్తు చేస్తూ విపక్షాలను నిందించకుండా సమస్యకు పరిష్కారాన్ని వెతుకుదామని ఆయన పిలుపునిచ్చారు. రైతుల్లో భరోసా కలిగించేందుకు తాము చేపడుతున్న చర్యలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ తదితర విపక్షాలకు ఆయన సూచించారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ కూర్చుంటే ప్రజల్లో చులకన అవుతామని ఆయన అన్నారు.