: కుటుంబాలతో కులాసాగా గడపండి... సివిల్ సర్వెంట్లకు మోదీ సూచన
కేంద్రంలోనే కాక రాష్ట్రాలు, జిల్లాల స్థాయి పరిపాలనలో సివిల్ సర్వెంట్లదే కీలక భూమిక. నిత్యం తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సిన అధికారులు, ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా, కొంప కొల్లేరే. అలాగని కుటుంబాలతో కులాసాగా గడపని రీతిలో పనిచేయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే విషయాన్ని ఆయన నిన్నటి సివిల్ సర్వీసెస్ డేలో ఉన్నత స్థానాల్లోని అధికారులకు సూచించారు. 'కుబుంబాలతో రోబోల్లాగా కాకుండా కాస్త కులాసాగా గడపండి' అంటూ ఆయన చేసిన సూచన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. అదే సమయంలో రాజకీయ ప్రమేయానికి, రాజకీయ జోక్యానికి ఉన్న తేడాను గమనించి కూడా పాలన సాగించాలని ఆయన పేర్కొన్నారు.