: రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చాలా విచారకరం: లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన


ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకున్న రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య ఘటనపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. అతని ఆత్మహత్య చాలా విచారకరం, హృదయ విదారకమని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఆ సమయంలో అతనిని చాలా మంది కోరారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రైతు ఆత్మహత్యలు చాలా సున్నితమైనవని, ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదని విపక్షాలకు సూచించారు. అధికార, విపక్షాలు కలిసి ప్రజల్లో భరోసా కల్పించాలని రాజ్ నాథ్ కోరారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. ఆత్మహత్యల నివారణ దిశగా ప్రణాళిక తెస్తామని, రైతులు ఆనందంగా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. భూసార పరీక్షలు చేసి రైతులకు సాయం చేస్తున్నామని రాజ్ నాథ్ వివరించారు. ఓ వైపు మంత్రి సభలో ప్రకటన చేస్తుండగానే విపక్షాలు గందరగోళం సృష్టించాయి.

  • Loading...

More Telugu News