: తెలుగు రాష్ట్రాల్లో నేటి సాయంత్రం పలు చోట్ల వడగళ్ల వాన, పిడుగులు పడే అవకాశం
నేటి సాయంత్రం భూ ఉపరితలంపై తక్కువ ఎత్తులో ప్రమాదకర క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం వుందని తెలిపింది. రైతులు, రైతు కూలీలూ జాగ్రత్త పడాలని కోరింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో, తెలంగాణలోని కొన్ని చోట్ల క్యుములో నింబస్ మేఘాల ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది. కాగా, నేటి ఉదయం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.