: కాంగ్రెస్ సభ్యత్వం కావాలంటే... కులం వివరాలు చెప్పాల్సిందేనట!


కాంగ్రెస్ పార్టీ... భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నేటి దాకా అలుపెరగని పోరు సాగిస్తూనే ఉంది. కేంద్రంలోనే కాక మెజారిటీ రాష్ట్రాల్లో కూడా సుదీర్ఘ కాలం పాటు పాలనను సాగించిన ఆ పార్టీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదును చేపడుతోంది. ఇందులో విశేషమేముందనుకుంటున్నారా? అన్ని పార్టీల్లాగే కాంగ్రెస్ కూ ఆ మాత్రం అర్హత లేదా అని ప్రశ్నిస్తారా?... మన ప్రశ్నలన్నింటినీ పక్కనబెట్టి, ఆ పార్టీ సభ్యత్వ నమోదును పరిశీలిస్తే ముక్కున వేలేయక తప్పదు. ఎందుకంటే, ఆ పార్టీ సభ్యత్వం కావాలనే వ్యక్తి, తన కులం వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనట. ఇక ఆన్ లైన్ సభ్యత్వంలో అయితే, కులం వివరాలు లేకుండా సభ్యత్వం పొందలేమట. అంతేకాదండోయ్, వ్యక్తిని కులం అడగడం ఎంతమాత్రమూ తప్పు కాదని కూడా ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ వ్యవహారంపై బీహార్ లో సామాజిక కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News