: బెజవాడలో ప్రేమోన్మాది వేధింపులు... ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడలో ప్రేమోన్మాదానికి మరో విద్యార్థిని బలైపోయింది. ప్రేమిస్తున్నానంటూ ఓ ఆకతాయి వెంటబడి వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థిని తేజ మానస ఆత్మహత్య చేసుకుంది. యనమలకుదురులో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆ బాలిక సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. ప్రేమోన్మాది రేణుకారావు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ ఆ బాలిక సూసైడ్ నోట్ లో రాసింది. బాలిక సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రేమోన్మాది కోసం గాలింపు ప్రారంభించారు.