: విప్రో ఉద్యోగులకు కోటి విలువైన షేర్లు


ఐటీ దిగ్గజ సంస్థ విప్రో తన ఉద్యోగులకు షేర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ లో కోటి రూపాయల విలువచేసే 18,819 వాటాలను అర్హులైన ఉద్యోగులకు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ వాటాలను 2005, 2007 పరిమిత స్టాక్ యూనిట్ ప్రణాళికల కింద జారీ చేస్తున్నట్టు విప్రో తెలిపింది. "ఈ నెల 20న నిర్వహించిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఆఫ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వాటాలకు సంబంధించి ఓ తీర్మానాన్ని జారీ చేశాం. పరిమిత స్టాక్ యూనిట్ ప్లాన్ 2005, 2007 కింద అర్హులైన ఉద్యోగులకు రూ.2 ముఖ విలువ కలిగిన 18,819 ఈక్విటీ వాటాలను కేటాయించాలని నిర్ణయించాం" అని విప్రో సంస్థ బిఎస్ఇ ప్రకటనలో తెలిపింది. దేశంలో మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో నిన్న(బుధవారం) నాలుగో త్రైమాసికంలో నికర లాభం 2.1% పెరిగి రూ 2,286.5 కోట్లు సాధించింది. బోర్డు స్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ కుమారుడు రిషద్ బోర్డుకు బాధ్యత వహిస్తారన్న నేపథ్యంలో లాభాల శాతం పెరిగినట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News