: వీడిన మిస్టరీ... ఎయిర్ హోస్టెస్ రీతూను హత్య చేసింది భర్తే!


మూడు రోజుల క్రితం హైదరాబాదులో అనుమాస్పద స్థితిలో మరణించిన ఎయిర్ హోస్టెస్ రీతూ మరణం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె శరీరంపై బలమైన గాయాలున్నాయని పోస్ట్ మార్టం నివేదిక రాగా, ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులు తొలి అనుమానిత వ్యక్తిగా భర్త సచిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత తనకేం తెలియదని బుకాయించినా, చివరికి ఆమెను హత్య చేసింది తనేనని అంగీకరించాడు. టీవీ రిమోట్ విషయంలో ఆమె తనతో గొడవపడిందని, తన స్నేహితుడు రాకేష్ ఎదుట తనపై చెయ్యి చేసుకుందని సచిన్ పోలీసులకు తెలిపాడు. తనను అవమానించినందుకే రీతూను హత్య చేసినట్టు వివరించాడు. ఆమెను కొట్టి, మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చాడని తెలిపారు. దీంతో, రీతూది హత్యేనని నిర్ధారించిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.

  • Loading...

More Telugu News